Thursday, January 31, 2008

అనువంశికత

వంశ రహస్యాన్ని నేనే...

పార్థివ శరీరం నశించినా జీవిస్తాను.

నా చిహ్నాలు చిరంతనం.

కాలరేఖ పొడవునా...

ఆది నించి అనంతం లోకి,

నెలవు నుంచి నెలవు కు-

విస్మృతి పై ఉరుకుతాను.

'యుగ యుగాల' సాంక్రమిక లక్షణం

నాలోవంపులు తిరుగుతుంది-

గొంతు లో ప్రతిధ్వనిస్తుంది -

చూపులో హొయలు పోతుంది-

మానవ జీవనకాల పరిమితత్వ బంధనాన్ని

తిరస్కరిస్తాను.

అవును,

నేను చిరంతనాన్ని.

మృత్యు ఘంఠారావాన్ని.

లక్ష్యపెట్టని మానుషత్వంలోనిఅమరత్వాన్ని.





-THOMAS HARDY.





ఆయన 1917లో రాసిన ఈ కవిత శీర్షిక 'అనువంశికత'.అప్పటికి వంశపారంపర్య లక్షణాల గురించి ప్రపంచానికి తెలిసినా,మానవ శరీరం లోని ఏ పదార్థమ దానికి వాహకం గా పనిచేస్తుందో తెలీదు.ఒక మహా వైజ్ఙానిక సూత్రాన్ని మాత్రం ఈ కవిత స్పష్టం గా సూచించింది.



*స్వాతి సపరివార పత్రిక,17/10/2003.

1 comment:

  1. చివరలో హార్డీ గారి కవిత అని వ్రాశారు. అయితే మీరు అనువదించారా? అద్భుతం. తెలుగులో స్వతంత్ర కవిత అనిపించేలా ఉంది. కలగాపులగంగా ఉన్న ఆకృతులలో దాగిఉన్న చిత్రం స్వరూపం వెలికితీస్తున్నట్లుగా అనిపించింది.

    ReplyDelete