వంశ రహస్యాన్ని నేనే...
పార్థివ శరీరం నశించినా జీవిస్తాను.
నా చిహ్నాలు చిరంతనం.
కాలరేఖ పొడవునా...
ఆది నించి అనంతం లోకి,
నెలవు నుంచి నెలవు కు-
విస్మృతి పై ఉరుకుతాను.
'యుగ యుగాల' సాంక్రమిక లక్షణం
నాలోవంపులు తిరుగుతుంది-
గొంతు లో ప్రతిధ్వనిస్తుంది -
చూపులో హొయలు పోతుంది-
మానవ జీవనకాల పరిమితత్వ బంధనాన్ని
తిరస్కరిస్తాను.
అవును,
నేను చిరంతనాన్ని.
మృత్యు ఘంఠారావాన్ని.
లక్ష్యపెట్టని మానుషత్వంలోనిఅమరత్వాన్ని.
-THOMAS HARDY.
ఆయన 1917లో రాసిన ఈ కవిత శీర్షిక 'అనువంశికత'.అప్పటికి వంశపారంపర్య లక్షణాల గురించి ప్రపంచానికి తెలిసినా,మానవ శరీరం లోని ఏ పదార్థమ దానికి వాహకం గా పనిచేస్తుందో తెలీదు.ఒక మహా వైజ్ఙానిక సూత్రాన్ని మాత్రం ఈ కవిత స్పష్టం గా సూచించింది.
*స్వాతి సపరివార పత్రిక,17/10/2003.
ధృక్కోణం . .
(Blog Under Re-invigoration . .)
Thursday, January 31, 2008
వాడు
నిండు గర్భిణిలా వున్న ఆ పాసెంజర్ రైల్లో...
ఒకపదేళ్ళ బాలుడు.
వాడి చేతిలో అమ్మకానికున్నసమోసాల సంచీ !
వాడి ముఖంలో అంతులేని నిర్వేదం.
కళ్ళలో ఎక్కడలేని నిరాశ;
ఆకలితోనూ,ఆవేదనతోనూ వెన్నుకంటుకుపోయిన పొట్ట.
బక్కపలుచని శరీరం.
తైల సంస్కారంలేని జుట్టు,
మురికికొట్టుకుపోయిన బట్టలు,
వాడి నిస్సహాయాతని తెలియచెప్పేఅమాయకమైన చూపులు...
వాడి అవతారం !
టీ గ్లాసులు కడిగిన హోటల్ యజమానిచే
తన్నులు తిన్న పసి శరీరం.
ఆరోజు పగిలిన గ్లాసులాగే,
ముక్కలైన వాడి అమూల్యమైన బాల్యం !!
చెదిరిన కుటుంబాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం లో...
రైలుపట్టాల్లోనూ,చెత్తకుప్పల పక్కనా...
ప్లాస్టిక్ గ్లాసులూ,
ప్లేట్లూ...గాజుముక్కలూ...
ఏరిన రోజునవాడి,
విసిరివేయబడ్డ ఆ వస్తువుల్లానే...
వాడి బాల్యమూ...
జీవితమూ...
విసిరివేయబడ్డాయి !
వాడు,
తనకిష్టమైన 'చందమామ' తో పాటే నైట్ డ్యూటీ చేస్తాడు.
విప్పారిన నేత్రాలతోసూర్యుడు పనిచెయ్యటానికొస్తే...
అలసిన కళ్ళు నులుముకుంటూవీడుమళ్ళీ బయల్దెరతాడు.
ఏ దిశకో ?
ఏ తీరానికో ?
ఏ 'దివి ని దించటానికో ?
బతుకుభారాన్ని భుజాన వేసుకుని...
ఒకపదేళ్ళ బాలుడు.
వాడి చేతిలో అమ్మకానికున్నసమోసాల సంచీ !
వాడి ముఖంలో అంతులేని నిర్వేదం.
కళ్ళలో ఎక్కడలేని నిరాశ;
ఆకలితోనూ,ఆవేదనతోనూ వెన్నుకంటుకుపోయిన పొట్ట.
బక్కపలుచని శరీరం.
తైల సంస్కారంలేని జుట్టు,
మురికికొట్టుకుపోయిన బట్టలు,
వాడి నిస్సహాయాతని తెలియచెప్పేఅమాయకమైన చూపులు...
వాడి అవతారం !
టీ గ్లాసులు కడిగిన హోటల్ యజమానిచే
తన్నులు తిన్న పసి శరీరం.
ఆరోజు పగిలిన గ్లాసులాగే,
ముక్కలైన వాడి అమూల్యమైన బాల్యం !!
చెదిరిన కుటుంబాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం లో...
రైలుపట్టాల్లోనూ,చెత్తకుప్పల పక్కనా...
ప్లాస్టిక్ గ్లాసులూ,
ప్లేట్లూ...గాజుముక్కలూ...
ఏరిన రోజునవాడి,
విసిరివేయబడ్డ ఆ వస్తువుల్లానే...
వాడి బాల్యమూ...
జీవితమూ...
విసిరివేయబడ్డాయి !
వాడు,
తనకిష్టమైన 'చందమామ' తో పాటే నైట్ డ్యూటీ చేస్తాడు.
విప్పారిన నేత్రాలతోసూర్యుడు పనిచెయ్యటానికొస్తే...
అలసిన కళ్ళు నులుముకుంటూవీడుమళ్ళీ బయల్దెరతాడు.
ఏ దిశకో ?
ఏ తీరానికో ?
ఏ 'దివి ని దించటానికో ?
బతుకుభారాన్ని భుజాన వేసుకుని...
-SAMPATH RAJA RAM,
31-10-2006.
31-10-2006.
నేను 2006-07 సంవత్సరంలో నిజాం కాలేజ్ లో బి.ఎ.ఫస్ట్ యియర్ చేస్తూ హైదరాబాద్ లో వుండటం ఇస్టం లేక ఇంటికీ,కాలేజ్ కి రావడానికీ హైదరాబాద్ కి రోజూ ట్రైన్ లో అప్ అండ్ డౌన్ చేసేవాడిని.కష్టమనిపించినా,రైలు లో వుండే జనాన్ని గమనించవచ్చని రోజూ రైలు ప్రయాణం ఇష్టంగా చేసేవాడిని.నేను రోజూ పొద్దుటే వెళ్ళే రైలు ఎప్పుడూ ఫుల్ రష్ గా వుండేది.నేనలా వెళ్ళటం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఆ ట్రైన్ లో చాలామంది చిన్న పిల్లలు సమోసాలమ్మటం గమనించాను.చదువూ...సంధ్యలు లేక పొట్ట కొసం వాళ్ళంత కష్టపడటం,నన్ను బాగా వేదనకు గురిచేసింది.ఆ అవేదనలోనుంచి పుట్టిందే పై కవిత.
బాల్యం...
బాల్యం...
మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే అనుభూతుల పర్వం.
తెల్లవారేసరికి విరగబూసిన గన్నేరు పూలని
నేస్తాలతో పోటీపడి చలిలో ఎగిరెగిరి అందుకోవడం;
ఆ పూలలాగే ఆ జ్ఞాపకాల్నీ అందుకోవాలి.
ఆకశంలో ఎగిరే పక్షుల వరస,
వాటిలానే స్వేచ్చగా అనంతాకాశంలో తేలిపోవాలనుకున్నా...!
చల్లగాలికి నిలబడి
నీలాకాశంలోనిమేఘాల విచిత్రాకారాల గురించి
చేసిన ఓ కొలిక్కిరాని పరిశీలన.
హనుమంతుడి గుడిలో
నేస్తాలతో కలిసి రేగుపళ్ళ కోసంచేసిన హడావిడి,
ఆ అల్లరికి చుట్టుపక్కలవాళ్ళచే తిట్లు తిన్న వైనం.
ఎక్కడో ఎగిరే విమానం నడిపే పైలట్ కి చెప్పిన"టాటా''...,
మలిసంధ్యలో తొలిచుక్కకి చెప్పిన "హలో"...
బడిలో...'లెక్కలు చేయలేదేం రా...?'
అని లెక్కల మాస్టారి ట్రీట్మెంటూ,
ఇంట్లో 'చదవకపోయావో...?'అని వార్నింగులూ!
బడిచెట్లకింద వేపపల్లతోనో,రాళ్ళతోనో'
మూడు రాళ్ళాటాడటానికి పడిన అష్ట కష్టాలు,
అందుకు టీచర్ ల చేతిలోతన్నులూ ...
తో పాటూ...
నీరునిండిన చెరువులోకి గులకరాళ్ళు విసరడం...
ఇలాంటి చేదు అనుభవాల్ని విసిరేయడమేమో...?!
చిరుగాలికి అల్లాడిపోయే ఆకుని చూస్తే,
నాన్న కోపానికి భయపడి అమ్మ కొంగు చాటున
దాక్కోవటం గుర్తుకురావటం.
చెల్లాయి కోసమని,దాని చేతులకు చాలనిగాజులు తెచ్చి,
నే తెచ్చా చూడ మని అమ్మకిచ్చిన చిలిపి చిన్నతనం.
అల్లరి చిల్లరగా తిరుగుతూ ,తూనీగల్నీ,సేతాకోకచిలకల్నీ...
వేటాడి ఆనందించిన ఆకతాయితనం.
గ్రంథాలయ వారోత్సవ పాటలపోటీలోపాడి
గ్రామాధ్యక్షురాలిచే 'బహుమతి' తీసుకున్న తొలివిజయం.
ఇంగ్లిష్ లో తొలిసారిగా వచ్చిన నూటికి తొంభై మార్కులూ,
అవి అందించిన ఆత్మవిశ్వాసమూ...
ఆ రోజులు మళ్ళీ వస్తాయా...?!
మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే అనుభూతుల పర్వం.
తెల్లవారేసరికి విరగబూసిన గన్నేరు పూలని
నేస్తాలతో పోటీపడి చలిలో ఎగిరెగిరి అందుకోవడం;
ఆ పూలలాగే ఆ జ్ఞాపకాల్నీ అందుకోవాలి.
ఆకశంలో ఎగిరే పక్షుల వరస,
వాటిలానే స్వేచ్చగా అనంతాకాశంలో తేలిపోవాలనుకున్నా...!
చల్లగాలికి నిలబడి
నీలాకాశంలోనిమేఘాల విచిత్రాకారాల గురించి
చేసిన ఓ కొలిక్కిరాని పరిశీలన.
హనుమంతుడి గుడిలో
నేస్తాలతో కలిసి రేగుపళ్ళ కోసంచేసిన హడావిడి,
ఆ అల్లరికి చుట్టుపక్కలవాళ్ళచే తిట్లు తిన్న వైనం.
ఎక్కడో ఎగిరే విమానం నడిపే పైలట్ కి చెప్పిన"టాటా''...,
మలిసంధ్యలో తొలిచుక్కకి చెప్పిన "హలో"...
బడిలో...'లెక్కలు చేయలేదేం రా...?'
అని లెక్కల మాస్టారి ట్రీట్మెంటూ,
ఇంట్లో 'చదవకపోయావో...?'అని వార్నింగులూ!
బడిచెట్లకింద వేపపల్లతోనో,రాళ్ళతోనో'
మూడు రాళ్ళాటాడటానికి పడిన అష్ట కష్టాలు,
అందుకు టీచర్ ల చేతిలోతన్నులూ ...
తో పాటూ...
నీరునిండిన చెరువులోకి గులకరాళ్ళు విసరడం...
ఇలాంటి చేదు అనుభవాల్ని విసిరేయడమేమో...?!
చిరుగాలికి అల్లాడిపోయే ఆకుని చూస్తే,
నాన్న కోపానికి భయపడి అమ్మ కొంగు చాటున
దాక్కోవటం గుర్తుకురావటం.
చెల్లాయి కోసమని,దాని చేతులకు చాలనిగాజులు తెచ్చి,
నే తెచ్చా చూడ మని అమ్మకిచ్చిన చిలిపి చిన్నతనం.
అల్లరి చిల్లరగా తిరుగుతూ ,తూనీగల్నీ,సేతాకోకచిలకల్నీ...
వేటాడి ఆనందించిన ఆకతాయితనం.
గ్రంథాలయ వారోత్సవ పాటలపోటీలోపాడి
గ్రామాధ్యక్షురాలిచే 'బహుమతి' తీసుకున్న తొలివిజయం.
ఇంగ్లిష్ లో తొలిసారిగా వచ్చిన నూటికి తొంభై మార్కులూ,
అవి అందించిన ఆత్మవిశ్వాసమూ...
ఆ రోజులు మళ్ళీ వస్తాయా...?!
Subscribe to:
Posts (Atom)