వంశ రహస్యాన్ని నేనే...
పార్థివ శరీరం నశించినా జీవిస్తాను.
నా చిహ్నాలు చిరంతనం.
కాలరేఖ పొడవునా...
ఆది నించి అనంతం లోకి,
నెలవు నుంచి నెలవు కు-
విస్మృతి పై ఉరుకుతాను.
'యుగ యుగాల' సాంక్రమిక లక్షణం
నాలోవంపులు తిరుగుతుంది-
గొంతు లో ప్రతిధ్వనిస్తుంది -
చూపులో హొయలు పోతుంది-
మానవ జీవనకాల పరిమితత్వ బంధనాన్ని
తిరస్కరిస్తాను.
అవును,
నేను చిరంతనాన్ని.
మృత్యు ఘంఠారావాన్ని.
లక్ష్యపెట్టని మానుషత్వంలోనిఅమరత్వాన్ని.
-THOMAS HARDY.
ఆయన 1917లో రాసిన ఈ కవిత శీర్షిక 'అనువంశికత'.అప్పటికి వంశపారంపర్య లక్షణాల గురించి ప్రపంచానికి తెలిసినా,మానవ శరీరం లోని ఏ పదార్థమ దానికి వాహకం గా పనిచేస్తుందో తెలీదు.ఒక మహా వైజ్ఙానిక సూత్రాన్ని మాత్రం ఈ కవిత స్పష్టం గా సూచించింది.
*స్వాతి సపరివార పత్రిక,17/10/2003.
చివరలో హార్డీ గారి కవిత అని వ్రాశారు. అయితే మీరు అనువదించారా? అద్భుతం. తెలుగులో స్వతంత్ర కవిత అనిపించేలా ఉంది. కలగాపులగంగా ఉన్న ఆకృతులలో దాగిఉన్న చిత్రం స్వరూపం వెలికితీస్తున్నట్లుగా అనిపించింది.
ReplyDelete